చలం గురించి చెప్పటం అంటే మనలోని ఒక కోణాన్ని గురించి చెప్పినట్లే... కాని ఆ కోణఁ మాత్రమె చలం కాదు.. అటువంటి అనేక లక్షల కోణాలను తనలో ఇముడ్చుకున్న ఒక అధ్బుత వ్యక్తి, ఒక సాముహిక శక్తి... ఆయన ఒక్కడే ఈ సమాజపు విలువలను వేయి గొంతుకలతో ప్రశ్నించగల సామర్ధ్యుడు.. అందిన చొప్పదంటు సమాధానాలతో తృప్తి పడక నిరంతరం వెతికిన ఒక అన్వేషి... ఒక ఋషి.... ఒక తాత్విక వాది.... ఆర్య సమాజం లో తిరిగినా, దానినుంచి బయటకు వచ్చి వాటి మూలాలనే ప్రశ్నించినా, మనసుకు నిజమని నమ్మిన సిద్ధాంతం ఆచరించగలిగినా నమ్మని రోజు దానిని ధైర్యం గా ఒప్పుకో కలిగినా .. నిక్ష్పక్ష పాతం గా విమర్శించ కలిగినా ఆ విమర్శను తీసుకో కలిగినా ఒక్కడే ఆనాటికి ఈనాటికి... అది మన చలం.. ఆయన కు శత సహస్ర నమస్సులతో ఆయన రచనలను ఆయన ఆలోచనలనూ ఈ తరం వారికి అందించ గలిగితే ఈ నా ప్రయత్నం సఫలమని అనుకుంటున్నాను..
mee tappalu kosam eduru chustuu
ReplyDelete@అప్పాజి గారు
ReplyDeleteతప్పకుండా నండి... ఇదుగో స్త్రీ లో నాకిష్టమైన పేజ్
"ఆయన ఒక్కడే ఈ సమాజపు విలువలను వేయి గొంతుకలతో ప్రశ్నించగల సామర్ధ్యుడు.. అందిన చొప్పదంటు సమాధానాలతో తృప్తి పడక నిరంతరం వెతికిన ఒక అన్వేషి... ఒక ఋషి.... ఒక తాత్విక వాది...." ఎంత శక్తివంతమైన వ్యాఖ్యలు. రచయితగా, మనిషిగా, తెలుగు తొలితరం స్త్రీవాదిగా చలం మిమ్మల్ని ఆవహించకపోతే మీరింత చక్కటి వ్యక్తీకరణ చేసేవారు కాదు. అందులోనూ టెక్నాలజీ రంగంలో ఉంటూ చలం పట్ల ఇంత passion. హృదయపూర్వక అభినందనలతో
ReplyDeleteరాజశేఖర్
రాజశేఖర్ గారు,
ReplyDeleteనమస్తే. మీరు నా సైట్ కు వచ్చి చదివి కామెంట్ ఇవ్వటమే నాకు ఒక పెద్దప్రశంస. అందులో మళ్ళీ మెచ్చుకోవటం. ధన్యవాదాలండి. చలం వంటి మహోన్నత జ్వాల ను గురించి మాట్లాడటమంటేనే సూర్యుని దివిటీ పెట్టి చూపించటమే ఇంక మీ వంటి సాహిత్యాభిలాషులకుచెప్పే ప్రయత్నం అంటే మాటలా.. చలం అంటే నాకు అభిమానం అంటే ఒక చిన్నపదం. సంఘపు గిట్టల కింద నలిగి తెలుసుకున్న సత్యాన్వేషి ఆయన ను గేలి చేసే వారే కాని అర్ధం చేసుకున్నవారు ఆనాటికి ఈ నాటికి తక్కువ శాతమే.. ఏదో నా చిరు ప్రయత్నం మీ వంటి సహౄదయులు మెచ్చుకున్నందుకు ధన్య వాదాలు.
"సంఘపు గిట్టల కింద నలిగి తెలుసుకున్న సత్యాన్వేషి ఆయన ను గేలి చేసే వారే కాని అర్ధం చేసుకున్నవారు ఆనాటికి ఈ నాటికి తక్కువ శాతమే.."
ReplyDeletebhavana garu
నేను ఇప్పుడు ఆశ్చర్యపడుతున్న విషయం ఏంటంటే,
గేలి చేసేవాళ్ళే కాక, ఆయనగురించి తెలీకుండానే ఆయన ఫేమస్ కాబట్టి గొప్ప మనిషి అని అనేసే మనుష్యులనూ చూసాను. అర్థం చేసుకోక విమర్శించడమూ అర్థం చేసుకునే ప్రయత్నమే చేయకపోవడమో ...రెండు రకాల ద్రోహాలు కదా !