Monday, August 10, 2009

టాగోర్ గీతాంజలి కు చలం తెలుగు అనువాదం28.
నన్నల్లుకున్న బంధాలు మొండివి. కాని వాటిని తెంపుకోవాలని ప్రయత్నిస్తే, నా హృదయం భాదిస్తుంది...

నాకు కావలసిందల్లా స్వేచ్చ. కాని దాని కోసం ఆశించటానికి కూడా నాకు సిగ్గవుతోంది.

నాకు నిశ్చయం గా తెలుసు నీలో విలువల్ని మించిన ఐశ్వర్యముందని, నువ్వు నా వుత్తమ మిత్రుడవని, కాని నా గది నిండా పేరుకున్న విలువలేని తళుకుల్ని వూడ్చేసేందుకు నా మనసొప్పదు..

నన్ను కప్పిన దుప్పటి వుత్త దుమ్మూ, మృత్యువూ. దాన్ని చూస్తే నాకు పరమ ద్వేషం. అయినా దాన్ని ప్రేమతో గట్టిగా హత్తుకుంటాను.

నా రుణాల కంతం లేదు. నా లోపాలు బహుళం. నా లజ్జ రహస్యమైనదీ, భారమైనదీ. ఐనా నన్ను దిద్దమని నిన్ను అడగటానికి వొచ్చి, తీరా నా ప్రార్ధన ను కటాక్షిస్తావేమోనని వొణికిపోతాను.28.

Obstinate are the trammels, but my heart aches when I try to break them.

Freedom is all I want, but to hope for it I feel ashamed.

I am certain that priceless wealth is in thee, and that thou art my best friend, but I have not the heart to sweep away the tinsel that fills my room.

The shroud that covers me is a shroud of dust and death; I hate it, yet hug it in love.

My debts are large, my failures great, my shame secret and heavy; yet when I come to ask for my good, I quake in fear lest my prayer be granted.

11 comments:

 1. చలం గారిని రెండు బాషలలో ప్రావీణ్యం ఉందనుకుంటాను.

  ReplyDelete
 2. బాగుంది భావన గారు, మీ టపా,మరియు మీ బ్లాగు, చాలా బాగా తీర్చిదిద్దారు, ఇలాగే కొనసాగించండి.

  ReplyDelete
 3. @ప్రవీణ్: అవును ఆయన మ్యూజింగ్స్ చదవండి, ఆయన సమకాలీన ఆంగ్ల రచయతలందరిని ఆమూలాగ్రం చదివేరు ఆయన. ధన్యవాదాలు.
  @ హను: నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. చదివేనండి.. బాగుంది.ఇందులోనే " యు . యఫ్. ఎ . అంతర్జాతీయ అధ్యక్షుడు చలం" చుడండి. అందులో విశ్వం
  గారు కూడా ప్రస్తావించారు చలం గారు మైదానం రాసినప్పటి పరిస్థితులు అప్పటి ఆయన ప్రతిస్పందన.

  ReplyDelete
 5. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 6. ప్రవీణ్,
  మీ బ్లాగ్ తెరుస్తుంటే వెంటనే ఏదో గేమ్ పాప్ అప్ ఓపెన్ అయ్యింది . మీరు ఇంతకూ ముందు పంపిన లింక్ కూడా అలానే అయ్యింది. I thought its just coincidence and I thought I clicked on some thing else by mistake. But this time It just opened a pop up (looks like a games one) right after I clicked on the link you send, and it started asking me to click on OK button and all that nonsense. Immediately I got a call from security guy saying that I got a virus attack.
  I want to let you know about this so you will be careful about the uploading or maintaining the blog, as I am not so sure how they get to blog but I just want to bring to your attention. Please be aware of it. Thanks.

  ReplyDelete
 7. ఈ పుస్తకం నా దగ్గర కూడా వుంది. ఇంకా తెరవాల్సివుంది.
  మీరు ఎలాగూ వీటిని టైపు చేస్తున్నారుగా, వీటిని వఱుసక్రమములోనొక word లేదా txt పత్రిగా కూడా మీ దగ్గర వుంచితే, తరువాత వీటిని వికీమూలాలలోకి ఎక్కించవచ్చుఁ.

  అన్నట్టు వ్యాఖ్యాతల పేర్లు గులాబీరంగులో కనబడుటలేదు. రంగు మార్చితే బాగుంటుంది

  ReplyDelete
 8. తప్పకుండా రాకేశ్వర రావు గారు.. అన్ని జాగ్రత్త గా పెడతాను.

  ReplyDelete
 9. భావన, నిన్న చాలా సుదినం. నేను చలానికి చేరువవటం మళ్ళీ కాస్త దూరమవటం ఎన్నోసార్లు జరిగాయి. చాలా రచనలు చదివాను. ఆయన రచనల్లోని ఏదో బలీయమైన సమ్మోహన శక్తి ధైర్యాన్ని నూరిపోస్తుంటే చుట్టూచూస్తే కనపడే నిర్వికార జనసందోహం చూసి వెనుకడుగు - ఇలా నన్ను నేను రెండూగా చీల్చుకున్నట్లు. బాబా గారి వ్యాఖ్యతో మళ్ళీ ఓ సారి హృదయపు కుహరాల్లోంచి మళ్ళీ వెలికి వచ్చాడు. మనసు చిక్కబడిపోయింది. నిన్ను చాలా అభినందించాలి ఈ ప్రయత్నానికి. అన్ని రచనలు చదివాను. ఒకచోట బాబా గారు వ్యక్తం చేసిన భావాలే నా అభిప్రాయానికి దగ్గరగా వున్నాయి. చలం అజరామరం.

  ReplyDelete