Saturday, November 21, 2009

టాగోర్ గీతాంజలి కు చలం తెలుగు అనువాదం

13. పలకని ఒక రాగం.....

నేను పాడటానికి వొచ్చిన పాట ఈ నాటికి పాడకుండానే మిగిలి పోయింది.

నా వాయిద్య తంత్రుల్ని బిగువు చేస్తో, వొదులు చేస్తో నా రోజుల్ని గడిపేశాను.

తాళం సరిగా సాగలేదు. పదాల కూర్పు కుదరలేదు. నా హృదయం లో కాంక్షా బాధ మాత్రమే మిగిలి పోయింది. నువ్వు విచ్చుకోలేదు ఇంకా. గాలి మాత్రం నిట్టుర్చుతోంది, పక్కన.

అతని ముఖాన్ని చూడలేదు నేను. అతని ఖంఠమూ వినలేదు. నా ఇంటి ముందు నుంచి నడిచే అతని మెత్తని పాద ధ్వనిని మాత్రమే వినగలిగేను.

నేలపై అతనికి ఆసనం పరవడంలోనే దినమంతా గడిచిపోయింది. ఇంకా దీపం వెలిగించలేదు. అతన్ని ఇంట్లోకి ఎట్లా ఆహ్వానించను?


అతన్ని కలుసుకోగలననే ఆశ తో బతుకుతున్నాను. కాని ఆ కల ఇంకా ప్రాప్తించింది కాదు..


13.

The song that I came to sing remains unsung to this day.

I have spent my days in stringing and in unstringing my instrument.

The time has not come true, the words have not been rightly set;
only there is the agony of wishing in my heart.
The blossom has not opened; only the wind is sighing by.

I have not seen his face, nor have I listened to his voice;
only I have heard his gentle footsteps from the road before my house.

The livelong day has passed in spreading his seat on the floor;
but the lamp has not been lit and I cannot ask him into my house.

I live in the hope of meeting with him;
but the meeting is not yet.



18. ఒంటరి సాయంత్రం నీకోసం .....

మబ్బుల మీద మబ్బులు కమ్ముకు వొస్తున్నాయి. చీకటి పడుతోంది. ప్రియా, నన్నొంటరి గా ఈ తలుపు దగ్గర నీకై నిరీక్షణలతో ఎందుకిట్లా వదిలి వేశావు?

మధ్యాన్నపు కార్య కలాపంలో గుంపు తో కలిసి పని చేశాను. కాని ఒంటరి చీకటి రోజున నీ కోసం మాత్రమే ఆశ పడతాను. నువ్వు నీ ముఖం కనపరచక పోతే నన్నింత ఎడం చేసి వొదిలేస్తే ఈ ధీర్ఘ వర్ష ఘడియల్ని ఎట్లా గడపగలనో తెలీదు.

ఆకాశంలోని దూరపు గుబులు వంక చూస్తో కూచున్నాను. నా హృదయం, శాంతి నెరగని ఈదురు గాలితో కలిసి ఏడుస్తో ఇటూ అటూ తిరుగుతోంది..

18.


Clouds heap upon clouds and it darkens. Ah, love, why dost thou let me wait outside at the door all alone?

In the busy moments of the noontide work I am with the crowd, but on this dark lonely day it is only for thee that I hope.

If thou showest me not thy face, if thou leavest me wholly aside, I know not how I am to pass these long, rainy hours.

I keep gazing on the far-away gloom of the sky, and my heart wanders wailing with the restless wind.

15 comments:

  1. these are the magical verses.

    i divide people who read gitanjali and who did not.

    bollojubaba

    ReplyDelete
  2. ఈ పుస్తకం నాదగ్గర వుంది కానీ ఎప్పటికప్పుడు ఓ రెండు పేజీలు చదవగానే బోర్ కొడుతుంది. నొ అఫెన్స్. నాకు అందులోని సారాన్ని , అనుభూతిని, అనుభవించే తరుణం ఇంకా రాలేదని ప్రక్కన పెట్టేస్తాను.అసలు కొనేటప్పుడు గీతాంజలికి అంత పేరెందుకు వచ్చిందో తెలుసుకోవాలని కొన్నాను. కానీ చదవాలి అనే జిజ్ఞాస ను ఈ పుస్తకం కొంచమైనా కలిగించ లేక పోయింది.

    ReplyDelete
  3. బాబా గారు. అవునండి. నిజమా గా మత్రగాని చేతిలో నుంచి విసిరిన పూల వాన గీతాంజలి. నాకు ఇష్టమైనవి అన్ని ఆ ఆర్డర్ లోనే పోస్ట్ చేస్తున్నా..
    గీతాంజలి బాగుంటుంది దాని ముందు మాట కూడా బాగుంటుంది. ఆయన అంటారు: గొప్ప కవిత్వ సృష్టి కాని, అనుభవం కాని మనసు వెనుక ఎంతో లోతున వుంటే sublime or supernal plane లో జరుగుతుంది. మనసు కు తెలిసేది స్వల్పం. గీతాంజలి అంతరార్ధం చలానికేమి తెలుసు? టాగూరు కెంతమాత్రం తెలుసు?

    "నీ పాటల అర్ధాలన్నీ చెప్పమని అడుగుతారు ఏం చెప్పాలో నాకు తెలియదు. ఏమో, వాటి అర్ధమేమిటో ఎవరికి తెలుసు? అంటాను! " అన్టారు టాగూర్.
    తన emotional అనుభవానికి రూపకల్పన చేస్తాడు కవి. తమ విరహాన్ని, నిరాశని, విశ్వాసాన్ని, భయాన్ని, ఎన్నో విధాల పాడారు psalms రాసిన భక్తులూ, మీరా, బీర్, రామదాసు, త్యాగ రాజు. అంత భక్త పరాధీనుడైన ప్రభువు, తనెంత తపించినా దర్శనమివ్వడేమని త్యాగ రాజు వ్యధ, ఆశ్చర్యం, భయమ్, దానికంతటికి రూపమిచ్చి...
    ఖగరాజు నీ యానతి విని వేగ చన లేదో
    గగనానికి ఇలకు బహు దూరం బనినాడో
    కాకపోతే నువ్వెందుకు రావు? అని పాడ తాడు కవి. ఆ విరహం నీ హృదయమ్ లో ఏ కొద్ది గా మండినా, అతని తపనను నీకు అర్ధం చెయ్యటానికి అతనిచ్చిన రూప కల్పన విష్ణ్, వాహన్ం గరుడుడూ నీకు అనుభవాన్నియ్యటానికి అభ్యంతరాలు కానక్కరలేదు.
    కవి చెప్పేది నీకు పూర్తి అనుభవం లో వుంటే ఆ కవిత్వమ్ నీకు అనవసరం
    కవిత్వం చదివిన తరువాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందక పోతే ఆ కవిత్వం నీకు వృధా.
    నీకు తోచనిది, కనపడనిదీ కవి చెప్పిన తరువాత నీ అనుభవం లోనికి ఎంతో కొంత వచ్చేది, అదే నీకు సరి పడే కవిత..

    ఇలా ఎన్నో చదువుతూ చదువుతూ వుంటే ప్రతి సారి కొత్త వెలుగు తో కొత్త అర్ధాలతో మెరిపించ గల పుస్తకం. మీరన్నట్లు English నుంచి తెలుగు లో ఆ ఫ్రీ ఫ్లో చలం పుస్తకం లో కనపడుతుంది.

    ReplyDelete
    Replies
    1. tyagaraja keertana meeda mee visleshana baagundi= s.v.subba rao

      Delete
  4. భా. రా.రే: మీ దగ్గర చలం అనువాదమే వుందా.. నెమ్మది గా మంచి మూడ్ లో వున్నప్పుడు చదవటానికి ప్రయత్నించండి. నేను నిజం గా ఆశ్చర్య పోతున్నా మీకు ఏందుకు నచ్చలేదో అని.. ప్రతి దానికి ఒక టైం వస్తుంది మాస్టారు.

    ReplyDelete
  5. "శభా..షె...శభాషె" అని గట్టిగా అరవాలని వుంది... office లో అందరూ అదిరి పడేటట్లు... ;)(చిన్నపిల్లలం కదా మేడం... అలానే వుంటాం.. క్షమించేసెయ్యాలి మీరు)
    Super... కదా...
    చలం 'ప్రేమ లేఖలు' నుండి కూడా కొన్ని ప్లీజ్... ముఖ్యంగా అందులోని 'ముందుమాట' మొదటి పోస్ట్ గా రావాలి.

    ReplyDelete
  6. Nice post Bhavana. Thank you.

    I read Chalam's Geetanjali once or twice. Then gifted that to my best friend. I could not get it again. May be I didn't put 100% on my efforts,
    Now I must get it.

    I believe only Chalam can understand the pain Tagore wanted to express.

    Want to write a lot .... very few can put their soul in words. I am not fortunate to be one of them..

    ReplyDelete
  7. మురళి: మరి అంత లా అరవకు అబ్బాయ్.. నిజంగానే దడుచుకుంటారు ఆఫీస్ వాళ్ళు. రాస్తాను ఈ సారి ప్రేమలేఖలు మొదటి మాట. తప్పకుండా..

    ReplyDelete
  8. మైత్రేయి: తప్పకుండా కొనండి.. వదలకుండా చదవ వలసిన పుస్తకం అందులోను చలంలోని ప్రేమ తత్వం ఆధ్యాత్మిక కోణం ఇష్టపడే మీకు ఇంకా నచ్చుతుంది.. చలం గారి వుత్తరాలలో సూర్య ప్రసాద్ గారికి ఇంకా వజీర్ రెహ్మాన్ గారికి దీక్షితులు గారికి రాసిన వుత్తరాలలో కూడా వుంటుంది అనుకుంటా. ఆయన గీతాంజలి తెనిగించే కాలం నాటి ఆలోచనలు. గీతాంజలి చదివినప్పుడల్లా ఇలా అనుకుంటూ రాసేరు కదా చలం ఈ పుస్తకం అనుకుంటూ వుంటే ఏదో ఒక కొత్త రూపు రంగు వచ్చినట్లు వుంటుంది పుస్తకానికి.

    మీరు రాయలేక పోవటమేమిటి మైత్రేయి.. చలం గురించి సమర్ధవంతం గా బ్యాలెన్స్ పోకుండ రాస్తారు ఐతే. నాకు ఆయన గురించి ఏమి రాయాలన్నా ధైర్యం చాలదు. ఆయన గురించి ప్రత్యేకం గా ఏమి చెప్పాలన్నా చెప్పలేను నేను ఆయ రచనలు అందులోని వైవిధ్యత,అంతటి వైవిధ్యత ను మొదటి నుంచి ఆఖరి పుస్తకం వరకు అన్నిటి ని కలిపి వుంచిన అంతః సూత్రం ఐన ప్రేమ ను తపన ను లీలా మాత్రం గా ఐనా అర్ధం కావాలంటే చదవాలి, చదవాలి ఆయన పుస్తకాలను చదవాలి అంతే ఇన్కో మార్గం లేదనుకుంటాను మరి. ధన్య వాదాలు.

    ReplyDelete
  9. బాబాగారి మాటలే నావీనూ! గీతాజలి చదివిన వాళ్ళు-చదవని వాళ్ళు మనుషుల్ని ఇలా డివైడ్ చేస్తే?

    చలం గీతాంజలి చదువుతుంటే,టాగోర్ తెలుగు నేర్చుకుని ఇది చదివితే? అన్న ఆలోచన చాలా సార్లు వచ్చింది నాకు~!

    అద్భుతం భావనా!

    ReplyDelete
  10. బలే ఆలోచన సుజాత. నాకెప్పుడూ రాలేదు టాగోర్ తెలుగు నేర్చుకుని ఇది చదివితే... బాగుంది.. చలం మ్యూజింగ్స్ లో, ప్రేమ లేఖలు లో ఇంగ్లీష్ లో రాసినవి చదువుతే చాలేమో ఆయనకు తన గీతాంజలి ఎంతందం గా తెనిగిన్చాడో అర్ధం అవ్వటానికి. ప్రేమ లేఖలు లో అనుకుంటా షెల్లీ గార్డెన్ గురించి రాసేడని చెపుతూ చలం తన తోట గురించి రాస్తాడు ఆ ఒక్కటి చాలేమో టాగోర్ కు అర్ధం కావటానికి. ధన్య వాదాలు.

    ReplyDelete
  11. చలం గారి కథలు ఇప్పటి వరకు ఆంగ్లంలోకి అనువదించబడలేదు. చలం గారు బతికి ఉన్నప్పుడైనా అతను తన కథలని అంతర్జాతీయ బాష అయిన ఆంగ్లంలో వ్రాసి ఉండాల్సింది.

    ReplyDelete
  12. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    ReplyDelete
  13. dear friends i am basavaraju and also kannadiga. i am a big fan of chalam the great. if you have anybody premalekhalu book or poems please plesae send me.

    ReplyDelete